Header Banner

వీసా గడువు దాటినా అమెరికాలో ఉంటున్నారా ? యూఎస్ ఎంబసీ ఫైనల్ వార్నింగ్!

  Sat May 17, 2025 17:25        U S A

అమెరికాలో ట్రంప్ సర్కార్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో అధికారులకు దొరికితే ఏం చేస్తారో అన్న భయంతో చాలా మంది భారతీయులు తమ వీసా గడువు ముగిసినా స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోతున్నారు.

 

ఈ నేపథ్యంలో భారత్ లోని యూఎస్ ఎంబసీ వారికి కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో వీసా గడువు ముగిసినా స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోతున్న భారతీయులకు న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం ఇవాళ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా గడువు ముగిసినా భారత్ కు రాకుండా అమెరికాలో ఉండిపోతున్న వారు తనిఖీల్లో దొరికితే బహిష్కరణలు తప్పవని, అలాగే వారిపై అమెరికాకు రాకుండా శాశ్వత నిషేధం విధించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

కఠినమైన అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలు ఎలా ఉంటుందో వీసాదారుకు ఎంబసీ మరోసారి గుర్తుచేసింది. ఎక్స్ లో చేసిిన పోస్టులో మీరు మీకు ఇచ్చిన కాలానికి మించి అమెరికాలో ఉంటే మిమ్మల్ని బహిష్కరించవచ్చు , భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణించడంపై శాశ్వత నిషేధాన్ని ఎదుర్కోవచ్చని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో పర్యాటక, విద్యార్ధి, ఉద్యోగాల సహా అన్ని వీసాదారులకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది.

 

దీంతో అమెరికాలో ఉండే భారతీయులు వీసా గడువు ఉంటే సరి, లేకపోతే వెంటనే వెనక్కి వచ్చేయాలనేది ఎంబసీ హెచ్చరికగా తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో పలసదారుల బహిష్కరణల పర్వం కొనసాగుతుండటం, అందులోనూ భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎంబసీ చేసిన తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంబసీ హెచ్చరిక తర్వాత అయినా అక్కడ ఉండే అవకాశం లేని వారు వెంటనే వెనక్కి వచ్చేస్తే మేలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USVisa #VisaOverstay #USEmbassyAlert #ImmigrationWarning #USImmigration #VisaRules